పంజా వైష్ణ‌వ్ తేజ్ చిత్రం `ఉప్పెన‌`లో హీరోయిన్ గా క్రితి శెట్టి

Published on May 18, 2019 5:11 pm IST

హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న మూవీ “ఉప్పెన”.స్టార్ డైరెక్టర్ సుకుమార్ సొంత నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ మరియు మైత్రీ మూవీ మేక‌ర్స్‌ బ్యానర్స్ పై సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు సనా దర్శకునిగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ ఐన వైష్ణవ్ తేజ్ జాలరి గెట్ అప్ లో వున్న ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచింది. ఐతే వైష్ణవతేజ్ సరసన హీరోయిన్ గా మంగుళూరు భామ కృతి శెట్టి ని ఎంపికచేసినట్టు తాజా సమాచారం. ఇంతకు ముందు కృతి శెట్టి పలు తమిళ మూవీస్ తో పాటు ఓ కన్నడ మూవీలో నటించింది.

కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.ఈ చిత్రం మే 25 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. శ్యామ్ ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More