‘ఫైటర్’తో జోడీ కట్టనున్న హీరోయిన్ ఈమే !

Published on Jan 20, 2020 12:00 am IST

‘ఇస్మార్ట్ శంకర్’ విజయంతో జోరు మీదున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం ‘ఫైటర్’ సినిమా పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండతో పూరి మొదటిసారి చేస్తున్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. పూరి కూడా ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకే సినిమాలో తప్పకుండా బాలీవుడ్ నటినే కథానాయకిగా పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు.

యంగ్ బ్యూటీ అనన్య పాండేను కథానాయకిగా నిర్ణయించారని తెలుస్తోంది. అనన్య కూడా పూరి చెప్పిన కథ నచ్చడంతో సినిమాకు ఓకే చెప్పిందట. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ వెలువడాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమా రెగ్యులర్ షూట్ రేపటి నుండి ముంబైలో మొదలుకానుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని ఛార్మీతో కలిసి నిర్మిస్తుండగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జొహార్ సైతం నిర్మాణంలో పాలుపంచుకునే అవకాశాలున్నాయి. ఈ సినిమాతో విజయ్ నేరుగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More