హీరోయిన్ దొరికేసిందోచ్ !

Published on Jan 27, 2019 9:06 pm IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ తో కలిసి ‘ఇస్మాట్ శంకర్’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఇటీవలే మొదలైన ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. కాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ కోసం గత కొన్ని రోజులుగా చిత్రబృందం తెగ వెతుకుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలా మంది హీరోయిన్లును చూసిన పూరి మొత్తానికి నభా నటేష్ ను ఫైనల్ చేశాడట.

ఇక ఈ చిత్రంలో రామ్ న్యూ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించనుండగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్రఫీని అందించనున్నారు. పక్కా యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ‘మే’లో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం :