రాజశేఖర్ కు హీరోయిన్ దొరికింది !

Anjali

సీనియర్ హీరో డా .రాజశేఖర్ ‘గరుడ వేగ ‘సినిమా తరువాత చాలా సినిమాల్లో నటించనున్నారని ఇటీవల వార్తలు వచ్చినా అవి కార్య రూపం దాల్చలేదు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఆయన కొత్త సినిమాకు కమిట్ అయ్యారు. ‘అవె’ చిత్రంతో ఆకట్టుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్న చిత్రంలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఈచిత్ర టైటిల్ ను అధికారికంగా రేపు ప్రకటించనున్నారు.

అయితే అంతకన్నా ముందే ఈ టైటిల్ బయటికి వచ్చేసింది. ఈ చిత్రానికి ‘కల్కి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. ఇక ఈ చిత్రం 1983 జరిగే మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కనుందట. ఈచిత్రంలో రాజశేఖర్ కు జోడిగా తెలుగు అమ్మాయి అంజలి నటించనుంది. త్వరలోనే ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Exit mobile version