‘సరైన తోడు చాలు, ఇంకేం అక్కర్లేదు – కీర్తి సురేశ్‌

Published on Jun 20, 2021 2:02 am IST

మహానటి ఫేమ్ కీర్తి సురేశ్‌ కూడా సోషల్ మీడియాలో తరుచూ హడావుడి చేస్తోంది. ఈ మధ్య ఎప్పటికప్పుడు తన వ్యక్తి గత సంగతులను తన ఫాలోవర్స్ తో పంచుకుంటూ ముందుకు పోతుంది. ముఖ్యంగా తన యోగా, ఫిట్‌నెస్‌ వీడియోలను షేర్‌ చేస్తూ తనలోని వేరియేషన్స్ ను చూపిస్తూ సాగుతుంది కీర్తి. దాంతో సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా కీర్తి సురేష్ వీడియోలు, ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

తాజాగా వరల్డ్‌ పిక్‌ నిక్‌ డేకు తనకు సరైన తోడు దొరికిందంటూ పిక్‌నిక్‌ వెళ్లిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె ఒక మెసేజ్ పోస్ట్ చేస్తూ.. ‘సరైన తోడు, ఆహ్లాదకరమైన వాతావరణం… పైగా బీచ్‌ తీరాన హ్యాపీగా సాగిపోయే పిక్‌ నిక్‌.. అసలు ఇంతకంటే ఇంకేం కావాలి’ అని కీర్తి తన పెంపుడు కుక్క నైక్‌ తో ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది.

ఇక సినిమాల విషయానికి వస్తే… కీర్తి సురేశ్‌ ప్రస్తుతం మహేశ్‌ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కీర్తి ‘గుడ్ లక్ సఖి’ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :