ఇంటర్వ్యూ : కృతి శెట్టి – “శ్యామ్ సింగ రాయ్” లో బోల్డ్ సీన్స్ అందుకే చేశా

ఇంటర్వ్యూ : కృతి శెట్టి – “శ్యామ్ సింగ రాయ్” లో బోల్డ్ సీన్స్ అందుకే చేశా

Published on Dec 25, 2021 5:00 PM IST

ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ విడుదల కాబడిన చిత్రాల్లో నాచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఇంట్రెస్టింగ్ చిత్రం “శ్యామ్ సింగ రాయ్” కూడా ఒకటి. నిన్నటి శుక్రవారం రిలీజ్ అయ్యిన ఈ చిత్రాన్ని రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి లేటెస్ట్ గా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరి తాను ఎలాంటి విషయాలు పంచుకుందో చూద్దాం.

 

మీ మొదటి సినిమా ‘ఉప్పెన’ ఇప్పుడు ‘శ్యామ్ సింగ రాయ్’కి ఏం తేడా గమనించారు? ఎలా ప్రిపేర్ అయ్యారు?

ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్ సినిమాల్లోని పాత్రలకు చాలా తేడా ఉంది. బేబమ్మ పాత్ర కోసం చాలా తెలుగు సినిమాలను చూశాను. ట్రెడిషన్, కల్చర్ గురించి తెలియాలి. విలేజ్ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలీదు. శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసం ఇంగ్లీష్ సినిమాలు, మోడ్రన్ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసుకుని, నా స్టైల్లో నటించాను.

 

ఈ సినిమాలో స్మోకింగ్ కూడా చేశారు ఆ సీన్స్ చేసినప్పుడు ఎలా అనిపించింది?

నాకు స్మోకింగ్ అంటే నచ్చదు. కానీ ఈ పాత్ర కోసం అదే చాలెంజింగ్‌గా అనిపించింది. ఆ సీన్స్ తీసేయోచ్చా? అని దర్శకుడిని కోరాను. అది కీర్తి, నువ్ కృతి. తేడా ఉండాలి కదా? అని దర్శకుడు అన్నారు. ఆరోగ్య సేతు సిగరేట్లను తీసుకొచ్చారు. దాంట్లో ఓన్లీ మిల్క్ టేస్ట్ ఉంటుంది. సిగరెట్లను తాగడం మూడు రోజులు ప్రాక్టీస్ చేశాను. మొదటి రోజు ఫోటో షూట్ చేసేటప్పుడు నా చేతులు వణికిపోయాయి.

 

నాని గారితో వర్క్ ఎక్స్ పీరియెన్స్ ఎలా అనిపించింది?

నాకు నాని గారితో నటించడం అంటే మొదట్లో నాకు భయం వేసింది. కానీ ఆయన సెట్‌లొ ఎంతో ప్రోత్సహించేవారు. ఆయన వరకు మాత్రమే కాకుండా ప్రతీ ఒక్కరి పర్ఫామెన్స్ చూస్తారు. బాగుందని అంటారు. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే అంత కంఫర్ట్‌గా నటించగలిగాను.

 

ట్రైలర్ లోనే కనిపించింది మీకు నానికి మధ్యలో బోల్డ్ సీన్స్ వాటిపై ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుంది అనుకున్నారు?

బోల్డ్ సీన్స్ అంటే అంతా బ్యాడ్ అని అనుకుంటారు. ఏం చేసినా కూడా వృత్తి పరంగానే మేం చేస్తాం. యాక్షన్ సీక్వెన్స్‌లో ఎంత కష్టపడతారో అన్ని సీన్లకు అలానే కష్టపడతారు. అన్ని సీన్లలోనూ నటించినట్టే ఆ సన్నివేశాల్లోనూ నటిస్తాను. ఇండస్ట్రీలోకి రాకముందు నేను ఎక్కువగా సినిమాలు చూడలేదు. కథలో ఆ సీన్స్ అవసరం అనిపిస్తేనే చేస్తాను. లేదంటే నేను చేయను. శ్యామ్ సింగ రాయ్‌లో వాటితో కథ ముడి పడి ఉంది.

 

మరి మీ ఫ్యామిలీ ఈ సినిమా చూసారా? మీ నటనపై ఏమన్నారు?

నా ఫ్యామిలీ అంతా ఒక్కో చోట ఉంటారు. సినిమా టికెట్లను నాకు చూపించారు. సినిమాకు వెళ్తున్నామని చెప్పారు. మా నాన్న సినిమాను చూసి నన్ను మెచ్చుకున్నారు. బాగా చేశావ్ అని అన్నారు. ఆయన ఎప్పుడూ కూడా సెట్‌లోకి రారు. నా లుక్ గురించి తెలీదు. కొత్తగా, ఫ్రెష్‌గా ఉందని అన్నారు.

 

కెరీర్ పరంగా ఎలాంటి రోల్స్ అయితే మీరు ఎంచుకుంటారు?

స్టోరీ కంటే నా పాత్ర ఇంపార్టెన్స్ గురించి ఆలోచిస్తాను. ఇంటర్వెల్ వరకు ఉంటుందా? తరువాత ఉండదా? అని ఆలోచించను. నా పాత్రకు ప్రాముఖ్యత ఉందా? లేదా? అని అనుకుంటాను. రకరకాల పాత్రలను చేస్తే ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుంది. కామెడీ పాత్రలను చేస్తే ఆ టైమింగ్ తెలుస్తుంది. అందుకే విభిన్న పాత్రలను చేయాలని నిర్ణయించుకున్నాను.ఆడియెన్స్ కోసమే నేను రకరకాల పాత్రలను చేయాలని అనుకుంటున్నాను. వారు నాకు చాలా ప్రేమను ఇచ్చారు. ఆడియెన్స్‌కు నచ్చుతుందా? లేదా? అనే కోణంలోంచే ఆలోచిస్తుంటాను.

 

మరి ఈ సినిమాకి మీ డబ్బింగ్ ఎందుకు చెప్పలేదు?

నా పాత్రకు డబ్బింగ్ చెబుదామని అనుకున్నాను. కానీ కారెక్టర్ లుక్‌కి, నా వాయిస్‌కి మ్యాచ్ అవ్వలేదు. ఆ పాత్రకు బేస్ వాయిస్ కావాలని అన్నారు. కానీ నా వాయిస్ అలా ఉండదు. అందుకే డబ్బింగ్ చెప్పలేదు.

 

సాయి పల్లవి గారి నటన కోసం చెప్పండి?

సాయి పల్లవి పాత్ర నాకు చాలా నచ్చింది. నేను కూడా కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. ఆమె స్క్రీన్ మీద చాలా బాగా చేశారనిపించింది. నేను సెట్‌లో సాయి పల్లవిని కలవలేదు. ఓ సారి సెట్‌కు వెళ్లాను గానీ ఆ రోజు సాయి పల్లవి షూటింగ్ లేదు.

 

ఇంతకు ముందు నాని గారి సినిమాలు ఏమన్నా చూసారా?

నానిని అందరూ నాచురల్ స్టార్ అంటారు. ఆయన ఏ పాత్రను చేసినా ఆ పాత్రలోకి వెళ్లిపోతారు. ఆ కారెక్టర్‌ను అంత న్యాచురల్‌గా చేస్తారు. శ్యామ్ సింగ రాయ్ సినిమాల్లోని రెండు పాత్రల్లోనూ వేరియేషన్ ఉంటుంది. నాకు వాసు అంటేనే ఇష్టం. మిడిల్ క్లాస్ అబ్బాయి, నిన్ను కోరి సినిమాల్లోని నాని అంటే ఇష్టం.

 

మీకు నటిగా ఎలాంటి సినిమాలు చెయ్యాలని ఉంది?

నాకు యాక్షన్ సినిమాల్లో నటించాలని ఉంది. అలాంటి ఆఫర్లు వస్తే యాక్షన్స్ సీక్వెన్స్‌ల్లో శిక్షణ తీసుకుంటాను. నేను ఇంత వరకు డ్యాన్స్‌లే చేశాను. అలాంటి యాక్షన్ సినిమాల్లో చేస్తే చాలెంజింగ్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. ఓటీటీ ఆఫర్లు వస్తే కచ్చితంగా చేస్తాను.

 

ఫైనల్ గా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం చెప్పండి? బాలీవుడ్ ఆఫర్స్ ఏమన్నా వస్తున్నాయా?

‘బంగార్రాజు’ షూటింగ్ నిన్ననే పూర్తయింది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఫిబ్రవరిలో వస్తుందేమో. మాచర్ల నియోజకవర్గం ఏప్రిల్ లో వస్తుంది. రామ్‌తో సినిమా ఇంకా షూటింగ్ జరుగుతోంది. బాలీవుడ్ నుంచి ఇంకా ఆఫర్లు రాలేదు. నాకు ఆ ఆలోచన కూడా లేదు. నాకు ఇక్కడే ఇంత ప్రేమ దొరుకుతోంది. ఇక్కడే ఉండాలనిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు