స్పెషల్ సాంగ్ లో క్రేజీ హీరోయిన్ !

Published on Sep 15, 2018 3:47 pm IST

ఆర్ ఎక్స్ 100 సినిమా సక్సెస్ తో ఓవర్ నైట్ లో సెన్సేషనల్ హీరోయిన్ గా మారిపోయింది పాయల్‌ రాజ్‌పుత్‌. తన బోల్డ్ నెస్ గ్లామర్ తో కేవలం ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీ చూపును తన వైపుకు తిప్పుకుంది ఈ బ్యూటీ. కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ హీరోయిన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది.

పాయల్‌ రాజ్‌పుత్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌ లో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ – తేజ కాంబినేషన్ లో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ గా ఓ సినిమా రాబోతుంది. కాగా పాయల్ ఈ సినిమాలోనే స్పెషల్ సాంగ్ చేయనుందని, అందుకు ఆమె ఇప్పటికే అంగీకరించిందని సమాచారం. అయితే మొదటి సినిమాతోనే భారీ విజయం అందుకున్న హీరోయిన్, ఇలా ప్రత్యేక గీతాల్లో నటించడానికి అంత త్వరగా అంగీకరించరు. మరి పాయల్ అంగీకరించిందంటే సాహసం అనే చెప్పాలి. ఈ సాహసం ఆమె కెరీర్ కు ఎంతవరకు ప్లస్ కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం :