పవర్ స్టార్ ను ఫాలో అవుతోన్న పూజా హెగ్డే !

Published on May 10, 2021 12:59 pm IST

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ అంటేనే లక్షలాది అభిమానుల గుండె చప్పుడు. ఎందరో రాజకీయ సినీ ప్రముఖులు ఆయనను ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో టాల్ అండ్ క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే కూడా చేరింది. ఇంత‌కీ ప‌వ‌న్‌ కళ్యాణ్ ను పూజా ఏ విషయంలో ఫాలో అవుతుంది అంటే.. మామిడి ప‌ళ్ల‌ విషయంలో అట. వినడానికి కాస్త కామెడీగా ఉన్న ఇదే నిజం అంటుంది పూజా.

సహజంగా ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ ప్ర‌తి ఏడాది త‌న తోట‌లో పండిన మామిడి ప‌ళ్ల‌ను తన స్నేహితుల‌కు సన్నిహితులకు తానే స్వయంగా లెటర్ రాసి మరీ గిఫ్ట్‌ గా పంపుతుంటారు. కాగా ఇదే పంథాను పూజా హెగ్డే కూడా ఫాలో అవుతూ, ఆమె తోటలో పండిన పండ్లను సన్నహితులందరికీ గిఫ్ట్ గా పంపడం మొదలెట్టింది. మొత్తానికి పూజా టాలీవుడ్‌లో త‌న స్నేహితుల‌కు మ్యాంగో ప్యాక్‌ ల‌ను అందిస్తూ ముందుకు పోతుంది. అన్నట్టు మంగ‌ళూరులో ఈ స్టార్ హీరోయిన్‌ కు మామిడి తోట ఉంది.

సంబంధిత సమాచారం :