రెండో పెళ్లి పై సీనియర్ హీరోయిన్ క్లారిటీ !

Published on Jun 3, 2021 12:09 am IST

సీనియర్ హీరోయిన్ ‘ప్రేమ’ సినిమాలకు స్వస్తి చెప్పి.. ఇంటికే పరిమితం అయిపోయింది. అయితే, ‘ప్రేమ’ త్వ‌ర‌లోనే రెండో పెళ్లి చేసుకోనుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్రేమ ఆ వార్త‌ల‌ పై తాజాగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. త‌న రెండో పెళ్లిపై వ‌స్తున్న వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని ప్రేమ స్పష్టం చేసింది.

తాను ప్రస్తుతం ఒంటరిగా ఉన్నానని, ఒంటరిగా ఉన్నప్పటికి చాల సంతోషంగా ఉన్నాన‌ని ప్రేమ చెప్పుకొచ్చింది. ఇక త‌న ఆరోగ్యం పై వ‌స్తున్న రూమ‌ర్స్‌ పై కూడా ప్రేమ స్పందిస్తూ.. నా హెల్త్ పై వచ్చే రూమర్స్ లో కూడా నిజం లేదు. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అంటూ ప్రేమ మొత్తానికి వివరంగా వివరణ ఇచ్చింది.

ఇక 2006లో వ్యాపార‌వేత్త జీవ‌న్ అప్ప‌చ్చుని పెళ్లి చేసుకున్న ప్రేమ, పదేళ్ల కాపురం తరువాత, భర్తతో వచ్చిన మ‌న‌స్ప‌ర్ధ‌లు కారణంగా 2016లో విడాకులు తీసుకుని భర్తకు దూరం అయింది. మరి ఒంటరిగానే లైఫ్ లీడ్ చేస్తోందో.. రూమర్స్ నిజం చేస్తూ మళ్ళీ పెళ్ళి చేసుకుంటుందో కాలమే చెప్పాలి.

సంబంధిత సమాచారం :