వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ కొట్టేస్తోన్న క్రేజీ హీరోయిన్ !

Published on Mar 13, 2019 4:28 pm IST

‘ఛలో’ సినిమాతో టాలీవూడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక మండన్న. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి.. రెండవ చిత్రం ‘గీతగోవిందం’తో ఏకంగా స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది ఈ యంగ్ బ్యూటీ. అలాగే హీరోయిన్ గా నటించిన మూడవ చిత్రం దేవదాస్ కూడా పర్వాలేదనే విజయం సాధించడంతో రష్మికకు స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయి.

కాగా తాజాగా తమిళ ఇండస్ట్రీలోనూ ఆఫర్స్ దక్కించుకుంటుంది. కార్తీ హీరోగా మొదలవుతున్న కొత్త చిత్రంలో రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమంతో ఈ రోజే ప్రారంభం అయింది. ఈ సినిమాకు ‘రెమో’ ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్నాడు.

సంబంధిత సమాచారం :

More