బాలీవుడ్ స్టార్ తో షూట్ కి హీరోయిన్ రెడీ !

Published on Mar 29, 2021 11:00 pm IST

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ప్రస్తుతం యాక్షన్ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి నిర్మిస్తున్న చిత్రంలో పోలీస్ పాత్ర చేస్తున్నాడు. అయితే ఈ మధ్య ఈ స్టార్ హీరో ఎక్కువుగా తెలుగు, తమిళ్ హీరోయిన్స్ కి ఛాన్స్ ఇస్తున్నాడు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ కి వరుసగా తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చిన ఈ హీరో.. మరో సౌత్ హీరోయిన్ ప్రణీత సుభాష్ కి ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

కాగా ‘బుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అనే సినిమాలో ఆమె అజయ్ దేవగన్ కి జోడిగా నటించబోతుంది. అయితే ఇప్పటికే తన కెరీర్ లో ప్రణీత ‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో పవర్ స్టార్ సరసన నటించినా.. ఆ సినిమా వల్ల ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో ఏకంగా అజయ్ దేవగణ్ కొత్త సినిమాలో నటిస్తోంది కాబట్టి, కనీసం ఆమెకు బాలీవుడ్ లోనైనా లక్ కలిసి వస్తోందేమో చూడాలి. ఇక వచ్చే వారం మొదలుకానున్న కొత్త షెడ్యూల్ లో ప్రణీత షూట్ లో పాల్గొంది.

సంబంధిత సమాచారం :