ఆమె బయోపిక్ కు ఆమె అతిథి పాత్ర !

ఆమె బయోపిక్ కు ఆమె అతిథి పాత్ర !

Published on Nov 1, 2018 8:54 AM IST

ఒకప్పుడు మళయాళంలో ఒక వెలుగు వెలిగిన ‘షకీలా’ జీవిత కథ ఆధారంగా బయోపిక్ రాబోతున్న విషయం తెలిసిందే. మలయాళ దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు పూర్తి కావొచ్చింది. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం తన బయోపిక్ లో షకీలా అతిథి పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేష్‌ అతిథి పాత్రలో నటించమని అడగడంతో షకీలా అంగీకరించారట.

కాగా షకీలా పాత్రలో బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా నటిస్తోంది. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన షకీలా.. సినీరంగంలోకి ఎలా వచ్చారు, ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి, ఆమె ఎవరెవరు మోసం చేశారు లాంటి పలు ఆసక్తికరమైన విషయాలను ఈ బయోపిక్ లో చూపించనున్నారు. షకీలా తన జీవితంలోని అతి ముఖ్యమైన తప్పులు ఒప్పులు అన్నీ ఈ బయోపిక్ లో ఉంటాయని నా లైఫ్ లో జరిగిన ప్రతి విషయాన్నీ చిత్రబృందానికి చెప్పానని షకీలా గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు