“అశ్మీ” సినిమా ప్రతి మహిళా గర్వ పడే సినిమా – హీరోయిన్ రుషికా రాజ్

Published on Sep 2, 2021 12:03 am IST


సాచీ క్రియేష‌న్స్ ప‌తాకం పై స్నేహా రాకేశ్ నిర్మాత‌గా, నూత‌న ద‌ర్శకుడు శేష్ కార్తీకేయ తెర‌కెక్కిస్తున్న చిత్ర అశ్మీ. పూర్తిగా వైవిధ్య‌మైన కాన్సెప్ట్ తో థ్లిల‌ర్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రుషికా రాజ్, రాజా నరేంద్ర‌, కేశ‌వ్ దీపిక లీడ్ రోల్స్ చేస్తున్నారు.

ఈ సినిమా లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసిన రుషికా రాజ్ మీడియా తో ఈ సినిమా విశేషాలు పంచుకున్నారు, “నేను ఒక కన్నడ అమ్మాయిని నేను కన్నడ లో మూడు సినిమాలు చేసాను, తగరు అనే మూవీ నాకు మంచి పేరు తీసుకువచ్చింది. ఈ మూవీ పేరు అశ్మీ అంటేనే సంస్కృత పదం, నేను హీరోయిన్ గా చేయటానికి చాలా సంవత్సరాలు ఆగాను ఒక మంచి రోల్ చేయటానికి, అందరిలాగా చేయకూడదు చేస్తే సొసైటీ కి మంచి మెసేజీ వుండే క్యారెక్టర్ చేయాలి అనుకున్నాను. ప్రతి ఒక్క అమ్మాయి ఈ సినిమా నుంచి మెసేజ్ ఇవ్వాలి అని ఈ సినిమా చేశాను. ఈ సినిమా నేను మొదట ఒప్పుకునే అప్పుడు చాలా భయపడ్డాను. ఈ సినిమా ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చాలా భయం వేసింది. ఈ సినిమా లో మహిళలు ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల ని ఈ సినిమా లో చూపించటం జరిగింది. ఈ పాయింట్ నేను సినిమా చేయటానికి దోహద పడ్డది. ఈ సినిమా లో యాక్టింగ్ కి చాలా స్కోప్ వున్న పాత్ర ఇది. నేను తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నాను అని అందరు చెప్తున్నారు, నేను తెలుగు నేర్చుకోవాటినికి రెండు సంవత్సరాలు పట్టింది.

ఫస్ట్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అయిన డైరెక్టర్ గారు అయినా సినిమా ని ఓటిటి కోసం అని తీసి సినిమా బాగా వచ్చింది అని ఈ సినిమా ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు, ఈ సినిమా రిలీజ్ అవ్వటానికి మా పి.ఆర్.వో ఏలూరు శ్రీను గారు బాగా హెల్ప్ చేశారు. ఈ సినిమా లో ఎటువంటి అసభ్యకరమయిన సన్నివేశాలు లేవు కుటుంబం అంత కలిసి చూడదగిన సినిమా ఇది. డైరెక్టర్ శేష్ కార్తికేయ గారు చాలా మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నారు. నా క్యారెక్టర్ కి ఫస్ట్ వేరే అమ్మాయిని సెలెక్ట్ చేసి తరువాత ఆ ప్లేస్ లో నన్ను తీసుకున్నారు. ఈ సినిమా శివ, ప్రొఫెసర్, అశ్మీ మూడు క్యారెక్టర్ లు చుట్టూ తిరుగుతుంది. సినిమా లో ఒక సాంగ్ ఉంటుంది. అండి శాండీ అద్దంకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఫైనల్ గా ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే ఇది ప్రస్తుతం సమాజం లో ప్రతి మహిళా ఫేస్ చేస్తున్న క్యారక్టర్ ప్రతి మహిళా కి మెసేజీ రీచ్ అవ్వాలి అనేదే మా ఈ ప్రయత్నం” అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :