చరణ్ బిగ్ ప్రాజెక్ట్ హీరోయిన్ పై కొనసాగుతున్న సస్పెన్స్.!

Published on Jun 20, 2021 6:16 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు పాన్ ఇండియన్ స్టార్ దర్శకుడు శంకర్ కాంబోలో ఓ భారీ పాన్ ఇండియన్ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు చరణ్ చేస్తున్న రెండు భారీ పాన్ ఇండియన్ సినిమాల తర్వాత ఆగష్టు నుంచి ఈ చిత్రం మొదలు కానుంది అని టాక్ ఉంది. అయితే ఈ మోస్ట్ అవైటెడ్ సెన్సేషనల్ కాంబోపై గత కొన్నాళ్ల నుంచి హీరోయిన్ పరంగా అనేక వెర్షన్ లు ఉన్నాయి.

మరి వాటి ప్రకారం చాలా మంది స్టార్ హీరోయిన్స్ పేర్లు వినిపించాయి కానీ లాస్ట్ కి కియారా అద్వానీ పేరు ఫిక్స్ అయ్యిందని తెలిసింది. కానీ మళ్ళీ రేస్ లోకి రష్మికా మందన్నా పేరు వచ్చినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ హీరోయిన్ పేరు కూడా ఇంకా ఫైనల్ కానట్టు తెలుస్తుంది. దీనితో ఈ భారీ ప్రాజెక్ట్ కు మ్యాచ్ అయ్యే హీరోయిన్ ఎవరు అన్నది మళ్ళీ సస్పెన్స్ గా మారింది. మరి ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు ఫిక్స్ అవుతారో చూడాలి.

సంబంధిత సమాచారం :