నాని, నాగార్జునలకు హీరోయిన్లు ఫైనల్ అయ్యారు !

నాని, నాగార్జునలకు హీరోయిన్లు ఫైనల్ అయ్యారు !

Published on Apr 14, 2018 6:29 PM IST

యంగ్ హీరో నాని, సీనియర్ స్టార్ హీరో నాగార్జునలు కలిసి ఒక మల్టీ స్టారర్ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ మొదలై ఒక చిన్నపాటి షెడ్యూల్ ను పూర్తిచేసికున్న ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్న ఈ చిత్రంలో నాని, నాగార్జునలకు జోడీగా ఎవరు నటిస్తారనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఈ నైపథ్యంలో ఇన్నిరోజులు రకరకాల హీరోయిన్ల పేర్లు వినిపించగా ఎట్టకేలకు రష్మిక మందన్న, ‘మళ్ళీరావా’ ఫేమ్ ఆకాంక్ష సింగ్ లను ఫైనల్ చేశారు దర్శకనిర్మాతలు. వారిలో రష్మిక మందన్న నానికి జోడీగా నటించనుండగా నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి. అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు