మెగాస్టార్ ‘లూసిఫర్’లో మెయిన్ హైలైట్.. !

మెగాస్టార్ ‘లూసిఫర్’లో మెయిన్ హైలైట్.. !

Published on May 16, 2020 5:09 PM IST

chiru 2
మెగాస్టార్ చిరంజీవి – సుజీత్ కలయికలో రానున్న ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ కోసం చేస్తోన్న స్క్రిప్ట్ పనుల పర్యవేక్షనలో ప్రస్తుతం బిజీగా ఉన్నారు మెగాస్టార్. లాక్ డౌన్ వ్యవధిలో దర్శకుడు సుజీత్‌ తో మెగాస్టార్ వీడియో కాల్స్ ద్వారా సినిమా స్క్రిప్ట్ కి సంబంధించి చర్చలు జరుపుతున్నారు.

కాగా ఫిల్మ్ సర్కిల్స్‌ లోని తాజా అప్ డేట్ ఏమిటంటే, తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌లో మెగాస్టార్ కొన్ని కీలకమైన మార్పులను సూచించాడని.. సుజీత్ ఆ మార్పులను పూర్తి చేసి చిరుకి స్క్రిప్ట్‌ వినిపించాడని, ఫైనల్ గా చిరు స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ముఖ్యంగా హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సన్నివేశాలు సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని.. మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా ఉంటాయట.

ఇక గత ఏడాది సుజీత్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో మిశ్రమ ఫలితాలను అందుకుంది. అయినప్పటికి చిరంజీవి సుజీత్ టాలెంట్ పై నమ్మకముంచి అతనికే ఈ మూవీ రీమేక్ బాధ్యతలు అప్పగించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు