లేటెస్ట్… డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “హరిహర వీరమల్లు”

లేటెస్ట్… డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “హరిహర వీరమల్లు”

Published on Mar 19, 2024 6:31 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (PSPK) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కృష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా హరిహర వీరమల్లు(Harihara veeramallu). ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో మొదలై, ఇంకా పూర్తి కావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కి ఉన్న పొలిటికల్ కమిట్ మెంట్స్ కారణం గా సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ చిత్రం డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన అమేజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రైమ్ వీడియో అఫీషియల్ గా వెల్లడించడం జరిగింది.

బాబీ డియోల్, నిధి అగర్వాల్, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ. దయాకర్ రావు ఈ చిత్రంను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు