డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “హరిహర వీరమల్లు”?

డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “హరిహర వీరమల్లు”?

Published on Mar 19, 2024 12:37 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కృష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా హరిహర వీరమల్లు. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో మొదలై, ఇంకా పూర్తి కావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కి ఉన్న పొలిటికల్ కమిట్ మెంట్స్ కారణం గా సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది.

అయితే ఈ చిత్రం కి సంబందించిన డిజిటల్ రైట్స్ పై ఒక క్లారిటీ వచ్చింది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన అమేజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం డిజిటల్ హక్కులని మంచి ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బాబీ డియోల్, నిధి అగర్వాల్, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు