హైకోర్టు స్టే.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు బ్రేక్ !

Published on Mar 28, 2019 7:25 pm IST

రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని తీసిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. కాగా ఈ నెల 29న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని చిత్రబృందం రెడీ అయింది. అయితే తాజాగా ఈ చిత్రం విడుదల ఆపాలని ఏపీ హైకోర్టు స్టే విధించింది.

ఏపీలో జరిగే ఎన్నికలు పూర్తయ్యే దాకా సినిమాను థియేటర్స్ తో పాటు సోషల్ మీడియాలో కూడా.. అనగా.. ఫేస్ బుక్, ట్విట్టర్ మరియు యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించ రాదని కోర్టు ఆదేశించింది.

ఏప్రిల్ 15వ తేదీ తరువాత చిత్రాన్ని విడుదల చేసుకోవచ్చు అని కోర్టు తెలిపింది. వర్మకు ఇది పెద్ద షాకే. మరి ఇప్పుడు వర్మ ఏం చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :