కార్ చేజింగ్స్, గుర్రపు స్వారీలు..ఇది ఆ స్టార్ హీరో సెటప్

Published on May 6, 2021 3:00 am IST

స్టార్ హీరో సినిమా అంటే యాక్షన్ డోస్ కొద్దిగా ఎక్కువ ఉండాల్సిందే అంటుంటారు అభిమానులు. తమ అభిమాన హీరో స్క్రీన్ మీద హీరోయిజం పండిస్తుంటే చెప్పలేనంత థ్రిల్ పొందుతుంటారు. అందుకే మన స్టార్ హీరోలు తమ సినిమాల్లో కథ కొంచెం అటుఇటుగా ఉన్నా హీరోయిక్ ఎలివేషన్స్ మీద మాత్రం గట్టిగా దృష్టి పెడుతుంటారు. అదిరిపోయే ఫైట్లు, ఈలలు వేసే డైలాగ్స్, వీలైతే కొత్త తరహా స్టంట్స్ ట్రై చేయాలని చూస్తుంటారు. తమిళ హీరో విజయ్ తన తర్వాతి సినిమాలో ఇవన్నీ మెండుగా ఉండేలా జాగ్రత్తపడుతున్నారు.

విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇది కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇందులో గన్ ఫైట్స్, కార్ చేజింగ్స్, హార్స్ రైడింగ్స్ లాంటి ఎన్నో విశేషాలు ఉండనున్నాయి. ఇవన్నీ అభిమానుల కోసమే ప్రత్యేకంగా చేస్తున్న సెటప్. అందుకే ఫాన్స్ సైతం సినిమా పట్ల బాగా ఎగ్జైట్ అవుతున్నారు. సన్ పిక్చర్స్ భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటించనుంది. ఈ ఏడాదిలోనే సినిమాను పూర్తిచేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్ర బృందం.

సంబంధిత సమాచారం :