హిందీలో 300 కోట్లకు దగ్గరవుతోన్న బాహుబలి 2


ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి 2 చిత్రం కనీవినీ ఎరుగని వసూళ్లని రాబడుతోంది.బాలీవుడ్ వర్గాల్లే నివ్వెర పోయేలా హిందీలో బాహుబలి ప్రభంజనం కొనసాగుతోంది. ఈ చిత్రం విడుదలై వారం పూర్తయింది. ఈ చిత్ర హిందీ వర్షన్ కు మాత్రమే తొలివారంలో 250 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.విడుదలైన వారంలోనే ఈ స్థాయి కలెక్షన్లు రావడం బాలీవుడ్ ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇక ఈ చిత్రం త్వరలోనే 300 కోట్ల మార్క్ ని అందుకోబోతోంది.ఈ వారం పెద్ద చిత్రాలేవీ విడుదల కాకపోతుండడంతో బాహుబలి 2 హవా అలాగే కొనసాగనుంది. ప్రస్తుతం వస్తున్న వసూళ్లని బట్టి మున్ముందుకూడా బాహుబలి కలెక్షన్లు భారీస్థాయిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం 300 కోట్ల మార్క్ ని అందుకుంటే హిందీలో ఆ ఘనత సాధించిన ఐదవ చిత్రంగా బాహుబలి నిలుస్తుంది. దంగల్, పీకే, భజరంగీ భాయిజాన్, సుల్తాన్ చిత్రాలు ఇప్పటికే ఆ ఘనతని సాధించాయి.