హిప్పీ విడుదలతేది ఖరారు !

Published on Apr 17, 2019 11:22 am IST

ఆర్ఎక్స్ 100 తరవాత యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న రెండవ చిత్రం హిప్పీ. ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో కార్తికేయ సరసన దిగణన సూర్యవంన్షి , జజ్బా సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నాడు.

వి క్రియేషన్స్ పతాకం ఫై కోలీవుడ్ ప్రముఖ నిర్మాత కలై పులి ఎస్ తాను నిర్మిస్తున్న ఈచిత్రం జూన్ 7న విడుదలకానుంది. మరి ఈ చిత్రం తో కార్తికేయ బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడతాడో లేదో చూడాలి. ఇక కార్తికేయ ప్రస్తుతం అర్జున్ జంధ్యాల డైరెక్షన్లో తన మూడవ చిత్రంలో అలాగే నాని గ్యాంగ్ లీడర్ లో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :