“హిట్ 2” హిందీ రిలీజ్ ఎప్పుడు ప్లానింగ్ అంటే.!

“హిట్ 2” హిందీ రిలీజ్ ఎప్పుడు ప్లానింగ్ అంటే.!

Published on Dec 2, 2022 2:06 PM IST

లేటెస్ట్ గా టాలీవుడ్ లో వచ్చి మంచి టాక్ ని సంతరించుకున్న చిత్రం “హిట్ 2”. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం థ్రిల్లర్ ఆడియెన్స్ ని అయితే ఆకట్టుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాపై మన దగ్గర మరియు ఓవర్సీస్ లో కూడా మంచి హైప్ నెలకొనగా దీనితో నార్త్ రిలీజ్ పై కూడా తనకి అప్రోచ్ లు వచ్చినట్టు హీరో అడివి శేష్ రివీల్ చేసాడు.

ఇక లేటెస్ట్ గా అయితే సినిమా రిలీజ్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వూ లో అయితే మరిన్ని వివరాలు తాను వెల్లడించాడు. ఈ చిత్రాన్ని ఈ డిసెంబర్ చివరలో రిలీజ్ చేయనున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు. అంతే కాకుండా ఈ సినిమాని గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలిపాడు.

ఇంకా సినిమాకి తాను స్వయంగా డబ్బింగ్ చెప్పుకోనుండగా ఏదో సాధారణ రిలీజ్ గా అయితే చెయ్యమని పక్కా ప్లానింగ్ ప్రమోషన్స్ తో హిందీలో చేయనున్నట్టు శేష్ కన్ఫర్మ్ చేసాడు. అలాగే ప్రస్తుతానికి అయితే హిందీలో డిసెంబర్ 30కి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపాడు. మరి హిందీలో అయితే ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు