నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “హిట్ 3” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా నాని కెరీర్ లో పెద్ద హిట్ గా నిలవగా లేటెస్ట్ గా మేకర్స్ సినిమా సక్సెస్ మీట్ కూడా చేసుకున్నారు. మరి ఈ ఈవెంట్ లోనే నాని చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.
ఖచ్చితంగా శైలేష్ తో మరో సినిమా ఉందని తాను ప్రామిస్ చేసాడు. అయితే ఈసారి హిట్ 3 లాంటి సినిమా కాదు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ తో తాము రాబోతున్నట్టుగా తాను తెలిపాడు. శైలేష్ ఒక హిలేరియస్ లైన్ చెప్పాడు అని అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు కానీ సినిమా చాలా బాగుంటుంది అని ఇప్పుడు నుంచే నాని ప్రామిస్ చేస్తున్నాడు. దీనితో హిట్ 3 కాంబినేషన్ నుంచి ఈసారి నాన్ వైలెన్స్ సినిమా రాబోతుంది అని చెప్పాలి.