హిట్ కాంబినేషన్ సినిమా షూటింగ్ ప్రారంభం !

అల్లరి నరేష్ కొంత గ్యాప్ తరువాత మంచి స్క్రిప్ట్ తో వస్తున్నాడు. తన నెక్స్ట్ సినిమా బీమినేనీ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభం అయ్యింది. సునీల్ ఈ సినిమాలో అల్లరి నరేష్ ఫ్రెండ్ పాత్రలో కనిపించబోతున్నాడు. శ్రీ వసంత్ ఈ మూవీ కి స్వరాలు సమకూరుస్తున్నారు.

కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటులు అందరు ప్రేక్షకులను నవ్వించబోతున్నారు. సుడిగాడుతో అల్లరి నరేష్, బీమినేని శ్రీనివాస్ కాంబినేషన్ హిట్ కొట్టింది. మళ్ళి వీరిద్దరు కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ అంతకుమించి విజయం సాధించాలని కోరుకుందాం. ఈ మూవీ లో నటించబోయే ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి.