కొత్త లవ్ స్టోరీతో హిట్ కాంబినేషన్ !

కొత్త లవ్ స్టోరీతో హిట్ కాంబినేషన్ !

Published on Apr 10, 2019 10:00 PM IST

NagaShourya Srinivas

శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగసౌర్య, మాళవిక నాయర్ జంటగా ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ అవసరాల రాసిన స్క్రిప్ట్ లో లవ్ స్టోరీ చాలా కొత్తగా ఉండబోతుందట.

కాగా ఇప్పటికే ‘కళ్యాణ వైభోగమే’లో నాగసౌర్య – మాళవిక నాయర్ జంటగా నటించి ఆ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. అలాగే ‘నాగసౌర్య – అవసరాల శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద చిత్రాల కూడా మంచి విజయాలు సాధించాయి.

ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ కొత్త లవ్ స్టోరీతో రిపీట్ కాబోతుంది అన్నమాట. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు ‘దాసరి ప్రొడక్షన్స్’ పై టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ కలసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

తాజా వార్తలు