‘100 డేస్ అఫ్ లవ్’తో రానున్న హిట్ పెయిర్

‘100 డేస్ అఫ్ లవ్’తో రానున్న హిట్ పెయిర్

Published on Aug 12, 2015 9:22 AM IST

hundred-days-of-love
మలయాళంలో సూపర్ హిట్ పెయిర్ అనిపించుకున్న యంగ్ హీరో దల్క్వేర్ సల్మాన్ – నిత్యామీనన్ జంటగా నటించిన సినిమా ‘ఓ కాదల్ కన్మణి’. ఈ సినిమా తెలుగులో ‘ఓకే బంగారం’ గా రిలీజ్ అయ్యి పెద్ద అహిత్ అయ్యింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేసాడు. ఈ సినిమాతో ఈ హిట్ పెయిర్ కి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఈ ఏడాది మలయంలో వచ్చి హిట్ అయిన సినిమా ‘100 డేస్ అఫ్ లవ్’. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులోకి తీసుకు రావడానికి రంగం సిద్దమైంది.

ఎస్.ఎస్.సి మూవీస్ బ్యానర్ పై ఎస్. వెంకటరత్నం నిర్మాతగా ఈ సినిమాని తెలుగులోకి అనువదిస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ కి సంబందించిన కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. క్యూట్ రొమాంటిక్ కామెడీ స్టొరీగా మలయాళ ఆడియన్స్ ని మెప్పించిన ఈ సినిమాకి జెన్యూస్ మొహమ్మద్ దర్శకత్వం వహించాడు. ప్రనీత్ వర్మ హై లెవల్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకి గోవింద్ మీనన్ సాంగ్స్ కంపోజ్ చేస్తే, బిజిబాల్ నేపధ్య సంగీతం అందించాడు. ‘ఓకే బంగారం’తో హిట్ పెయిర్ అనిపించుకున్న దల్క్వేర్ సల్మాన్ – నిత్యా మీనన్ జంట ఈ సినిమాతో కూడా మరోసారి హిట్ పెయిర్ అనిపించుకుంటారని ఈ చిత్ర నిర్మాతలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు