దేశంలోనే అతిపెద్ద లగ్జరీ బ్యూటీ క్లినిక్‌గా పేరుగాంచిన ‘హివాగ’ తన నూతన బ్రాంచ్‌ను హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఘనంగా ప్రారంభించింది. గచ్చిబౌలి తర్వాత నగరంలో ఇది రెండవ బ్రాంచ్ కాగా, దేశవ్యాప్తంగా ఎనిమిదవది. ఈ క్లినిక్‌కు హరిత రెడ్డి సతి సీఈవోగా, రామ్ మోహన్ రెడ్డి సతి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇక్కడ అత్యాధునిక చర్మ, జుట్టు సంరక్షణ చికిత్సలతో పాటు సెలూన్ సేవలను అందించనున్నారు. నిపుణులైన డెర్మటాలజిస్టుల పర్యవేక్షణలో మహిళలు, పురుషులకు ప్రత్యేక ట్రీట్మెంట్లు అందుబాటులో ఉంటాయి. పర్మినెంట్ మేకప్, బ్రైడల్ మేకప్, పర్మినెంట్ హెయిర్ రిమూవల్ వంటి ఆధునిక సేవలు ఇక్కడ లభిస్తాయి. క్లినిక్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ చికిత్సకు ముందు హెల్త్ కౌన్సెలింగ్ ఇవ్వడం విశేషం.
ప్రారంభోత్సవం సందర్భంగా సీఈవో హరిత రెడ్డి మాట్లాడుతూ.. “మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండేలా సరసమైన ధరల్లో, అత్యుత్తమ ఉత్పత్తులతో నాణ్యమైన ట్రీట్మెంట్స్ అందిస్తున్నాం. వైజాగ్‌లో ప్రారంభమైన మా ప్రయాణం ఇప్పుడు ఎనిమిదో బ్రాంచ్‌కు చేరుకుంది” అని ఆనందం వ్యక్తం చేశారు. స్థానికుల ఆదరణతో త్వరలో తిరుపతి, భీమవరం, కాకినాడలలో కూడా కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.


