‘టాక్సిక్’ ఒక బ్యాంగర్ అంటున్న హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్

‘టాక్సిక్’ ఒక బ్యాంగర్ అంటున్న హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్

Published on Mar 13, 2025 11:00 PM IST

TOXIC

రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ ఇప్పటికే సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను పూర్తి గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

అయితే, ఈ సినిమా కోసం ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ జెజె.పెర్రి యాక్షన్ సీక్వెన్స్‌లను కొరియోగ్రఫీ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాలో చాలా సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంబోతున్నాయని.. యష్ అండ్ టీమ్ ఈ సీక్వెన్స్‌ల కోసం చాలా కష్టపడ్డారని జెజె.పెర్రి తాజాగా ఓ వర్కింగ్ స్టిల్ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.

ఇక ఈ సినిమా ఓ బ్యాంగర్‌గా ఉండబోతుందని ఆయన తెలిపారు. దీనికి యష్ ‘మీతో వర్క్ చేయడం నిజంగా అద్భుతంగా ఉంది’ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. నయనతార, కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు