నాలుగు రోజుల్లో వంద కోట్లు.. రెండు క్లైమాక్స్‌లు వర్కవుట్ అయినట్టే!

నాలుగు రోజుల్లో వంద కోట్లు.. రెండు క్లైమాక్స్‌లు వర్కవుట్ అయినట్టే!

Published on Jun 10, 2025 4:00 PM IST

బాలీవుడ్‌లో ఇటీవల కాలంలో రిలీజ్ అయిన చిత్రాల్లో చాలా తక్కువ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించాయి. రీసెంట్‌గా విక్కీ కౌషల్ నటించిన ‘ఛావా’ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. అయితే, ఆ తర్వాత పలు సినిమాలు వచ్చినా, పెద్దగా ఆకట్టుకోలేవు. కానీ, గతవారం రిలీజ్ అయిన ‘హౌస్‌ఫుల్ 5’ చిత్రంపై రిలీజ్‌కు ముందు మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

దర్శకుడు తరుణ్ మన్సుఖాని తెరకెక్కించిన ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో భారీ క్యాస్టింగ్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. అలాగే హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీపై నెలకొన్న బజ్ ఈ చిత్రానికి ఉపయోగపడింది. ఇక ఇదంతా పక్కనబెడితే.. ఈ హౌస్‌ఫుల్ 5 చిత్రానికి రెండు వైవిధ్యమైన క్లైమాక్స్‌లు పెట్టడం ఈ సినిమాకు సాలిడ్ రెస్పాన్స్‌ను తెచ్చిపెడుతుంది.

ఈ సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్క్‌ను క్రాస్ చేయడమే ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్‌కు ఉదాహరణ అని చెప్పాలి. క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతుండటంతో సినీ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు