చిరు సినిమాలో మహేష్ పాత్ర ఎలా ముగుస్తుంది..?

Published on Feb 28, 2020 7:09 am IST

చిరు 152వ చిత్రంలో మహేష్ కీలక రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేష్ దాదాపు అరగంట నిడివి కలిగిన కీలక రోల్ చేస్తున్నారట. మొదట్లో ఈ పాత్రను చరణ్ తో చేయించాలని నిర్ణయించిన చిత్ర యూనిట్ కారణం ఏదైనా మహేష్ ని రంగంలోకి దించారు. ఇక మహేష్ ది ఈ మూవీలో స్టూడెంట్ లీడర్ రోల్ అని వినిపిస్తుంది.

మాస్ కమర్షియల్ అంశాలు కలిగిన సోషల్ మెస్సేజ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కొరటాల మహేష్ పాత్రను ఎలా మెదలుపెట్టి ఎలా ముగిస్తాడు అనేది ఆసక్తికరం. పరిచయం సంగతి ఎలా ఉన్నా ఆ పాత్రకు ముగింపు ఎలా ఉంటుంది అనేది కీలక అంశం. మరి కొరటాల శివ ఎలా డిజైన్ చేశాడో చూడాలి మరి. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More