మాఫియా లీడర్ మాస్టర్ ఎలా అయ్యాడు?

Published on Apr 1, 2020 10:00 pm IST

బిగిల్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత విజయ్ నుండి వస్తున్న మాస్టర్ మూవీపై ఉన్న అంచనాలు అంతా ఇంతా కాదు. ఖైదీతో సూపర్ హిట్ అందుకున్న లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో మరింత క్రేజ్ ఏర్పడింది. విజయ్ సేతుపతి ఈ మూవీలో విలన్ గా చేయం మరొక విశేషం. ఇన్ని అనుకూలతల మధ్య వస్తున్న మాస్టర్ మూవీ విజయ్ గత చిత్రాల రికార్డ్స్ చెరిపివేయడం ఖాయం అని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

ఐతే ఈ మూవీలో విజయ్ పాత్ర రెండు నేపధ్యాలలో సాగుతుందని తెలుస్తుంది. ఒక పాత్రలో మాఫియా లీడర్ గా ఆయన కనిపించనుండగా, మరో పాత్రలో కాలేజీ ప్రొఫెషర్ గా కనిపిస్తాడట. ఐతే మాఫియా లీడర్ కాలేజీ ప్రొఫెసర్ ఎలా అయ్యాడు అనేదే, సినిమాలో అసలు ట్విస్ట్ అని తెలుస్తుంది. ఇక విజయ్ సేతుపతి, విజయ్ ల మధ్య ఆధిపత్య పోరు సినిమాకు హైలెట్ గా సాగుతుందని సమాచారం. మాస్టర్ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More