ఆర్ ఆర్ ఆర్ లో భీమ్, అల్లూరి కథ అలా ముగించకపోవచ్చు..!

Published on Apr 3, 2020 7:26 am IST

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది. టైటిల్ లోగో మోషన్ పోస్టర్ తో అంచనాలు పెంచేసిన రాజమౌళి చరణ్ పుట్టినరోజు కానుకగా భీమ్ ఫర్ రామరాజు వీడియోతో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి తీసుకెళ్లాడు. దీనితో ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమాని ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక హీరోల ఇంట్రడక్షన్ వీడియోతోనే ప్రేక్షకులకు అనేక ఫజిల్స్ వదిలారు రాజమౌళి. అల్లూరి సీతారామరాజుగా చరణ్ ని పోలీస్ గెటప్ లో పరిచయం చేశాడు. యూనిఫార్మ్ లో మీసం తిప్పుతున్న రామ్ చరణ్, చొక్కాలేకుండా పోలీస్ బెల్ట్, ప్యాంటు ధరించి వీర విజృభించారు. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ వీడియో తరువాత ఈ మూవీలో ఫిక్షన్ పాళ్ళు ఎక్కువే అని అర్థం అవుతుంది.

మరి వీరి పాత్రలను రాజమౌళి ఎలా ముగిస్తాడు అనేది కూడా ఆసక్తికర అంశం. చరిత్ర చూసుకుంటే కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు ఉద్యమంలో వీరమరణం పొందారు. వీరు అతి తక్కువ వయసులోనే బ్రిటిష్, మరియు నవాబుల చేతిలో చనిపోయారు. మరి చరిత్రను ఫాలో అవుతూ వీరి పాత్రలు మరణంతో ముగిస్తాడా? ఫిక్షనల్ స్టోరీ కాబట్టి వారిద్దరి చావు చూపించకుండా ఎండ్ కార్డు వేస్తాడా? అనే ఆలోచన చాలా మంది మదిలో మెదులుతుంది. మరి చూడాలి రాజమౌళి ఎన్టీఆర్, చరణ్ పాత్రలను ఆర్ ఆర్ ఆర్ లో ఎలా ముగిస్తాడో.

సంబంధిత సమాచారం :

X
More