స్టార్ ప్రొడ్యూసర్స్ మధ్య ఆసక్తికర పోరు..!

స్టార్ ప్రొడ్యూసర్స్ మధ్య ఆసక్తికర పోరు..!

Published on Jan 2, 2020 9:46 PM IST

Sarileru Ala

సంక్రాంతి సినిమాల వేడి విడుదలకు ముందే మొదలైంది. టాలీవుడ్ ఇద్దరు బడా హీరోలు మహేష్, అల్లు అర్జున్ నటించిన సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురంలో చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదల కానున్నాయి. ఈ రెండు భారీ బడ్జెట్ చిత్రాల విడుదల తేదీ విషయంలో ఆసక్తికర పోరు నడుస్తుంది. మొదట సరిలేరు నీకెవ్వరు జనవరి 11న, అలవైకుంఠపురంలో 12న విడుదల కానున్నట్లు ప్రకటించడం జరిగింది. ఐతే అలవైకుంఠపురంలో నిర్మాతలు తమ మూవీ విడుదల తేదీ జనవరి 10కి మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. అదే కనుక జరిగితే సరిలేరు నీకెవ్వరు మూవీ విడుదల తేదీ ముందుకు జరిపి జనవరి 10నే విడుదల చేయాలని భావిస్తున్నారట.

ఒకే రోజు రెండు భారీ చిత్రాలు విడుదల కావడం వాటి బాక్సాఫీస్ కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎంతో కొంత మేర ఓపెనింగ్ కలెక్షన్స్ కోల్పోవడంతో పాటు థియేటర్స్ సమస్య రావచ్చు. బయ్యర్లు కూడా ఆందోళను గురయ్యే పరిస్థితి వుంది. ఈ రెండు చిత్రాలను నిర్మిస్తుంది టాలీవుడ్ కింగ్ మేకర్స్ అయిన అల్లు అరవింద్ మరియు దిల్ రాజు. విడుదల విషయంలో వీరిద్దరి మధ్యలో నడుస్తున్న కోల్డ్ వార్ ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు బడా ప్రొడ్యూసర్స్ ఎవరి పంతం నెగ్గించుకుంటారో.. ఈ సమస్యకు ఎటువంటి పరిష్కారం ఆలోచిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు