ఒకే వేదికపై హృతిక్ రోషన్, ర్యాన్ గాస్లింగ్: ​మార్చి 26న ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ విడుదల

ఒకే వేదికపై హృతిక్ రోషన్, ర్యాన్ గాస్లింగ్: ​మార్చి 26న ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ విడుదల

Published on Mar 25, 2026 8:00 AM IST

hrithi

గ్లోబల్ సినిమా రంగంలో సరికొత్త సంచలనం సృష్టిస్తూ భారతీయ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, హాలీవుడ్ స్టార్ ర్యాన్ గాస్లింగ్ ఒకే వేదికపైకి వచ్చారు. రాబోయే సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ (Project Hail Mary) నేపథ్యంలో వీరిద్దరి మధ్య సాగిన ప్రత్యేక వర్చువల్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్పేస్, సైన్స్ మరియు సినిమా విశేషాలను పంచుకుంటూ సాగిన ఈ చర్చ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

​ఈ సందర్భంగా హృతిక్ రోషన్ నటించిన ‘కోయి… మిల్ గయా’ చిత్రానికి, ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’కి ఉన్న భావోద్వేగ సంబంధాలను వారు చర్చించారు. ఒకరి పనితీరును మరొకరు ప్రశంసించుకోవడమే కాకుండా, భవిష్యత్తులో కలిసి నటించే అవకాశాలపై కూడా సానుకూలంగా స్పందించారు. ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ర్యాన్ గాస్లింగ్ జ్ఞాపకశక్తి కోల్పోయిన ‘రైలాండ్ గ్రేస్’ అనే కీలక పాత్రలో కనిపించనున్నారు.

​అమెజాన్ MGM స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ భారీ ఎత్తున విడుదల చేస్తోంది. మార్చి 26, 2026న ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతదేశవ్యాప్తంగా ఐమ్యాక్స్ (IMAX) మరియు ఇతర ప్రీమియం ఫార్మాట్లలో ఈ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్‌ను వీక్షించవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు