టాక్ సూపర్, కలెక్షన్స్ డీసెంట్…!

Published on Jul 14, 2019 1:02 am IST

గణిత శాస్త్ర మేధావి ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన “సూపర్ 30”. ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాడంగా నిన్న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మధ్యతరగతి వర్గానికి చెందిన మ్యాథ్స్ టీచర్ ఆనంద్ కుమార్ పేదలైన అతిసామాన్య విద్యార్థులను తన ప్రతిభతో ఎలా తీర్చిదిద్దాడు అనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం కోసం హృతిక్ అద్భుతమైన ట్రాన్సఫర్మేషన్ అయ్యాడు.పేదవాడైన ఆనంద్ కుమార్ గా డి గ్లామర్ పాత్రలో చక్కగా నటించారు.

సినీ క్రిటిక్స్ తో పాటు ప్రేక్షకుల అభిమానం చూరగొన్న ఈ చిత్రం మొదటి రోజు డీసెంట్ వసూళ్లు సాధించింది. “సూపర్ 30” చిత్రం మొదటి రోజు 11.83కోట్ల షేర్ సాధించింది. మాస్ ఏరియాలలో వసూళ్లు అంత ఆశాజనకంగా లేకపోయినా రాబోయే శని,ఆదివారాలలో వసూళ్లు పెరిగే అవకాశం కలదు. వికాస్ బహెల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్స్,నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్స్,ఫాంటమ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి.

సంబంధిత సమాచారం :

X
More