తెలుగులో ‘బలం’ చూపించనున్న బాలీవుడ్ స్టార్ హీరో!

23rd, October 2016 - 11:12:02 AM

kaabil
బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన హృతి రోషన్‌కు దేశవ్యాప్తంగా తిరుగులేని సంఖ్యలో అభిమానులున్నారు. ఇక తన హిందీ సినిమాలతో పాటు, తెలుగులో డబ్ అయిన క్రిష్, క్రిష్ 3, ధూమ్ 2 తదితర సినిమాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హృతిక్ రోషన్ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన బాలీవుడ్ సినిమా కాబిల్ తెలుగులో డబ్ అవుతోందన్న విషయాన్ని టీమ్ కొద్దికాలం క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా నేడు తెలుగు వర్షన్‌కు బలం అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

దీపావళి కానుకగా బలం ఫస్ట్‌లుక్ విడుదల కానుందట. అదే రోజున హిందీ టీజర్‌తో పాటు తెలుగు టీజర్ కూడా విడుదలవుతుంది. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా జనవరి 26, 2017న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంజయ్ గుప్తా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను టీమ్ త్వరలోనే వెల్లడించనుంది.