
మొదటి సినిమా ‘గమ్యం’ నుంచి ప్రతిసారి తన సినిమాలో ఓ సరికొత్త నేపధ్యాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే డైరెక్టర్ క్రిష్ అలియాస్ రాధాకృష్ణ జాగర్లమూడి. అలాంటి క్రిష్ ఈ సారి వరల్డ్ వార్ II బ్యాక్ డ్రాప్ కి ఓ సున్నితమైన ప్రేమకథని కలిసి చేసిన సినిమా ‘కంచె’. ఒకే సినిమా అనుభంవం ఉన్న మెగా ఫ్యామిలీ యంగ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్ ట్రైలర్ ని కొద్ది సేపటి క్రితమే లాంచ్ చేసారు. ఈ ట్రైలర్ కి అందరి నుంచి వస్తున్న స్పందన ఒకటే .. ట్రైలర్ సూపర్బ్ అదిరిపోయింది.
తెలుగు సినిమా చిరత్రలోనే మొదటిసారిగా వరల్డ్ వార్ II బ్యాక్ డ్రాప్ ని తీసుకొని చేస్తున్న ఈ సినిమాలో విజువల్ అందరి చేత అద్భుతః అనిపించుకునే రేంజ్ లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు క్రిష్ విజన్ మరియు తను చూపిన విజువల్స్ విషయంలో ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. అలాగే వరుణ్ తేజ్ లుక్ మరియు డైలాగ్స్ చెప్పడంలో తన వాయిస్ మాడ్యులేషన్ అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ ఎపిక్ వరల్డ్ వార్ II మూవీలో వరుణ్ తేజ్ ఓ ఇండియన్ సోల్జర్ లా కనిపించనున్నాడు. వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైస్వాల్ హీరోయిన్ గా కనిపించనుంటే, బాలీవుడ్ యాక్టర్ నికేతన్ దీర్ విలన్ గా కనిపించనున్నాడు. సెప్టెంబర్ 12న గ్రాండ్ గా ఆడియోని రిలీజ్ చేసి, అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.

