‘బాబు బంగారం’గా మారిన వెంకీ

‘బాబు బంగారం’గా మారిన వెంకీ

Published on Dec 14, 2015 2:30 PM IST

Venkatesh
‘గోపాల గోపాల’ సినిమాలో నాస్థికుడుగా కనిపించి ప్రేక్షకులను మెప్పించిన విక్టరీ వెంకటేష్ ఆ తర్వాత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ తన తదుపరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళలేదు. దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత వెంకీ తన నెక్స్ట్ మూవీకి సిద్దం చేస్తున్నాడు. ఇటీవలే ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మారుతి డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ సినిమాకి సైన్ చేసాడు. ఈ సినిమా డిసెంబర్ 16న అధికారికంగా లాంచ్ కానుంది.

మారుతి ఈ సినిమా కథకి సెట్ అయ్యేలా ‘బాబు బంగారం’, ‘డిమాండ్ రాజ’, ‘రాజా రత్నం’, ’24 కారెట్ బంగారం’ అనే నాలుగు టైటిల్స్ ని పరిశీలిస్తున్నాడని ఇది వరకే తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం ఈ నాలుగు టైటిల్స్ లో ఫైనల్ గా ‘బాబు బంగారం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. మూహూర్తం రోజునే టైటిల్ లోగోని ని కూడా రిలీజ్ చేయనున్నారని సమాచారం. వెంకీ ఓ కామెడీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన అందాల భామ నయనతార జోడీ కట్టనుంది. జిబ్రాన్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాకి సూర్యదేవర నాగ వంశీ నిర్మాత.

తాజా వార్తలు