సినీపరిశ్రమపై కూడా ‘హుదూద్’ ప్రభావం

సినీపరిశ్రమపై కూడా ‘హుదూద్’ ప్రభావం

Published on Oct 12, 2014 12:47 PM IST

follds
విధ్వంసక ‘హుదూద్’ తుపాను ఆంధ్ర జిల్లాలను వణికిస్తోన్న సంగతి తెలిసిందే. హుదూద్ ప్రభావంతో ఇప్పటికే ఉత్తరంధ్రా, తూర్పు గోదావరి జిల్లాలో జనజీవనం స్థభించి పోయింది. దీని ప్రభావం వలన ఉత్తరంధ్రా, కోస్తా జిల్లాలలో మరియు తెలంగాణాలోని పలు ప్రాంతాలలో మరో 48 గంటల వరకు భారీ వర్షాలు పదనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అయితే ఈ తుపానుప్రభావం సినీపరిశ్రమపై తీవ్రంగా పడనుంది. ఇప్పటికే ఈ ప్రాంతాలలోని అన్ని ధియేటర్ లను, షాపింగ్ కాంప్లెక్స్ లను ప్రభుత్వం ముసివేయించింది, దీనితో మరో రెండు రోజుల వరకు దాదాపు ఐదు జిల్లాలో సినిమాలు నడవకపోవడంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోనున్నారు. ఇప్పటికే పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో తీవ్ర నష్టాలలో ఉన్న తెలుగు సినీపరిశ్రమకు ‘హుదూద్’ రూపంలో మరో దెబ్బ తగిలింది.

తాజా వార్తలు