“కేజీయఫ్ 2” ఒక్క క్లైమాక్స్ కోసమే అన్ని కోట్ల ఖర్చు.!

Published on Jan 20, 2021 11:00 am IST

ఇప్పుడు వస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో కన్నడ స్టార్ హీరో యష్ మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ ల కాంబోలో వస్తున్న “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. లేటెస్ట్ గా వచ్చిన టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెరిగిపోయాయి. ఒక్క కన్నడ తెలుగులోనే కాకుండా అన్ని కీలక ఇండస్ట్రీలలో కూడా ఈ సినిమాపై నెవర్ బిఫోర్ అంచనాలు నెలకొన్నాయి.

చాప్టర్ 1 ఊహలకు అందని హిట్ కావడంతో చాప్టర్ 2 పై ఈ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. మరి భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రంలోని క్లైమాక్స్ ఎంత కీలకమో తెలిసిందే. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ చేసిన అధీరా పాత్రకు మరియు రాకీ భాయ్ కు ఉండే భీకర పోరాట సన్నివేశం ఏ స్థాయిలో ఉంటుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరి ఈ ఒక్క క్లైమాక్స్ సీన్ కోసమే నిర్మాణ సంస్థ హోంబలె వారు భారీ ఎత్తున ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. మాసివ్ గా డిజైన్ చేసిన ఈ సన్నివేశానికి గాను 12 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. అలాగే ఈ చిత్రానికి 100 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు అయ్యినట్టు తెలుస్తుంది. మరి ఈ భారీ చిత్రం మాత్రం దీని బడ్జెట్ కు మినిమం ఐదింతలు ఖచ్చితంగా రాబట్టేయడం గ్యారంటీ అని చెప్పాలి. మరి ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ను మేకర్స్ ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :