భారీ ఏర్పాట్ల నడుమ మొదలవుతున్న ‘పైసా వసూల్’ ఆడియో వేడుక !
Published on Aug 17, 2017 5:30 pm IST


నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం ‘పైసా వసూల్’ క్రేజ్ మామూలుగా లేదు. బాలయ్య సరికొత్త గెటప్ లో, పూరీ స్టైల్లో ఉండే విభిన్నమైన పాత్రలో కనిపిస్తుండంతో ఈ చిత్రం పట్ల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మరోవైపు చిత్ర ఆడియో రిలీజ్ వేడుక ఈరోజే కావడంతో అభిమానుల్లో కోలాహలం తారా స్థాయిలో ఉంది. ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ ఆడియో కార్యక్రమం కోసం భారీస్థాయి ఏర్పాట్లు చేసింది.

వేడుక జరుగుతున్న ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బిజిఎన్నార్ కాలేజ్ గ్రౌండ్స్ కు బాలకృష్ణ, పూరి జగన్నాథ్, శ్రియ, చార్మీలు చేరుకోవడానికి ప్రత్యేక హెలికాఫ్టర్ ను ఏర్పాటు చేశారు. అంతేగాక వేడుక వద్ద అభిమానుల కోసం అన్ని రకాల సదుపాయాలను చేసినట్టు తెలుస్తోంది. అలాగే కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ సినిమాలో పాడిన పాటను లైవ్ లో పాడుతారని కూడా అంటున్నారు. ఇకపోతే యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook