“అఖండ”కు అంత బడ్జెట్ అవుతుందా.?

Published on Apr 29, 2021 9:00 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ “అఖండ”. తన హ్యాట్రిక్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన బడ్జెట్ పరంగా కొన్ని ఆసక్తికర అంశాలే ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

ఈ చిత్రానికి బాలయ్య కెరీర్ లో అత్యధిక బడ్జెట్ వెచ్చిస్తున్నారని టాక్. మరి అది 60 కోట్లకు పైగానే ఉండేలా ఉందని మరి టాక్ కూడా ఉంది. అయితే ఇందులో బాలయ్య రెమ్యునరేషన్ ఎక్కువ ఉంది అనుకుంటే అలా కూడా లేదట సినిమా పరంగానే ఖర్చు ఎక్కువ అవుతున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే చూసిన టైటిల్ రివీల్ టీజర్ లో నిర్మాణ విలువలు ఏ స్థాయిలో ఎంత సహజంగా అనిపించాయో చూసాము. అలా ఈ సినిమాకు భారీ బడ్జెట్ అవుతుందని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :