కమల్ ‘ఇండియన్ -2’ బడ్జెట్ ఎంతో తెలుసా !

విశ్వనటుడు కమల్ హాసన్ ‘భారతీయుడు’ సీక్వెల్ ‘ఇండియన్ -2’ కు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘రోబో-2’ చిత్రీకరణలో బిజీగా ఉన్న శంకర్ అది పూర్తవగానే ‘ఇండియన్-2’ ను మొదలుపెట్టనున్నారు. సాధారణంగానే శంకర్ సినిమాలంటే అన్ని విషయాల్లోనూ భారీతనం ఉట్టిపడుతుంటుంది. అలాగే ఈ సినిమా కూడా భారీ స్థాయిలో ఉంటుందట. అయితే ఈసారి ఆ భారీతనం కాస్త ఎక్కువ మోతాదులో ఉండనుందని వినికిడి.

ప్రకటన రోజు నుండే ఎక్కడాలేని హైప్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం కోసం సుమారు రూ.200 కోట్ల బడ్జెట్ ను కేటాయించారట నిర్మాత దిల్ రాజు. ఈ బడ్జెట్ చూస్తేనే శంకర్ ప్లాన్ ఈసారి ఏ రేంజులో ఉండనుందో అర్థమవుతోంది. సామాజిక అంశం నైపథ్యంలో ఉండబోతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయిందట. తెలుగు, తమిళ భాషల్లో నిర్మితంకానున్న ఈ చిత్రాన్ని పలు ఇతర భాషల్లోకి సైతం అనువదించనున్నారు. మరి ఇన్ని హంగులతో రానున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.