మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న విడుదల కానుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మే 23న భోపాల్‌లోని బీహెచ్‌ఈఎల్ దసరా గ్రౌండ్స్‌లో భారీ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ వేడుకలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు.
ఈ కాన్సర్ట్ కోసం దేశంలోనే మునుపెన్నడూ లేని విధంగా ముంబై నుండి రూ.150 కోట్ల విలువైన అత్యాధునిక మ్యూజిక్ ఎక్విప్‌మెంట్‌ను రప్పిస్తున్నారు. దీని అద్దె కోసమే మేకర్స్ రూ.1 కోటి వరకు ఖర్చు చేస్తున్నారు. యూవీ మీడియా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌లో ఒక స్పెషల్ సాంగ్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ వేడుకను చూడాలనుకునే వారి కోసం రేపటి నుండి వేదిక వద్ద ఉచిత పాస్‌లు పంపిణీ చేయనున్నారు.


