అక్కినేని నాగచైతన్య హీరోగా దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న చిత్రాన్ని NC24 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాను మిస్టిక్ థ్రిల్లర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అడ్వెంచర్స్ ఈ సినిమాలో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ఓ గ్లింప్స్ ద్వారా తెలిపారు.
అయితే, ఈ సినిమా కోసం ఓ భారీ గుహ సెట్‌ను వేశారు చిత్ర యూనిట్. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఈ భారీ సెట్ ఏర్పాటు చేయగా, ఇందులో పలు కీలక సీన్స్ తెరకెక్కించనున్నారు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా ఈ గుహ సెట్‌లో చిత్రీకరించనున్నారు. ఈ గుహ సెట్‌ను ప్రముఖ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగల డిజైన్ చేయగా, ఈ సెట్ కోసం ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు పెట్టారు.
ఇక ఈ సినిమాలో అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోండగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేస్తున్నాయి.


