“ఆదిపురుష్” షూట్ ప్లానింగ్ లో భారీ చేంజ్.!

Published on May 7, 2021 1:59 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో ప్లాన్ చేసిన ఇతిహాస గాథ “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూట్ ఇప్పటికే కొంత మేర కంప్లీట్ అయ్యిన సంగతి కూడా తెలిసిందే. అయితే మొదట నుంచి ఈ చిత్రం తాలూకా షూట్ అంతా ముంబై లోనే ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ ప్లాన్ లో మేకర్స్ భారీ చేంజ్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది.

ఇప్పుడు మేజర్ ఆఫ్ ది షూట్ అంతా హైదరాబాద్ కు షిఫ్ట్ చేసేసారట. మహారాష్ట్ర రాష్ట్రంలో పరిస్థితులు ఇప్పుడప్పుడే సెట్ అయ్యేలా లేవని చాలా మేర షూట్ అంతా హైదరాబాద్ లో చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. మొత్తం యూనిట్ మకాం అంతా మూడు నెలల పాటు ఇక్కడే ఉంటుందట. దీనిని బట్టి ఈ చిత్రం ఎంత మేర ఇక్కడే కంప్లీట్ కానుందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో సీతగా కృతి సనన్ రావణ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :