బాక్సాఫీస్ వద్ద తన స్టామినా చూపిస్తున్న పుష్ప..!

Published on Jan 2, 2022 4:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో చూపిస్తోంది. పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా మిగతా బాషల్లో కూడా అదే తరహా వసూళ్లను రాబడుతూ, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది.

ఇప్పటి వరకు ఈ చిత్రం 300 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను సాధించడం జరిగింది. బాలీవుడ్ లో సైతం భారీ వసూళ్ళను రాబడుతూ, 75 కోట్ల రూపాయల దిశగా దూసుకుపోతోంది. రష్మీక మందన్న హీరోయిన్ గా నటించగా, సమంత స్పెషల్ సాంగ్ లో నటించడం జరిగింది. సునీల్, అనసూయ భరద్వాజ్, ఫాహద్, ధనంజయ, అజయ్ ఘోష్ లతో పాటుగా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రెండవ భాగం పుష్ప ది రూల్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :