సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలు ఒకే రోజు విడుదల అవ్వడం కామన్ గా జరిగే విషయమే.. కానీ ఏ ఇద్దరి స్టార్ హీరోల సినిమాలైనా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయంటే బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద క్రేజ్ నెలకొంటుంది. ఇలాంటివి చాలా సార్లు జరుగుతూనే ఉంటాయి, కానీ ఈ సారి ఓ చిన్న ట్విస్ట్.. ఏమిటంటే ఒకే రోజున తండ్రి కూతుళ్ళ సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేయనున్నాయి.
ఇంతకీ వాళ్ళెవరూ అనే విషయంలోకి వెళితే.. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మరియు అందాల భామ శృతి హాసన్. కమల్ హాసన్ నటించిన ఉత్తమ విలన్ సినిమా మే 1న గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. అలాగే శృతి హాసన్ నటించిన బాలీవుడ్ మూవీ ‘గబ్బర్’ కూడా మే 1న రిలీజ్ కానుంది. ఇటు సౌత్ లో ఉత్తమ విలన పై భారీ అంచనాలు ఉంటే అటు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ‘గబ్బర్’ పైన అంచనాలున్నాయి. మరి ఈ రెండు సినిమాలతో ఒకే రోజు బాక్స్ ఆఫీసు పై దాడి చేయనున్న కమల్ హాసన్, శృతి హాసన్ లు ఇద్దరూ విజయాన్ని అందుకుంటారా.? లేదా.? అన్నది చూడాలి.


