ప్రభాస్ ‘సలార్’లో అవకాశం కోసం క్యూ కట్టిన జనం

ప్రభాస్ ‘సలార్’లో అవకాశం కోసం క్యూ కట్టిన జనం

Published on Dec 15, 2020 10:30 PM IST

Salaar

ప్రభాస్ ఇటీవల ప్రకటించిన నూతన చిత్రం ‘సలార్’. ‘కెజిఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. పాన్ ఇండియా లెవల్లో తయారవనున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే అంచనాలు భారీ స్థాయిలో నెలకొని ఉన్నాయి. అన్ని ప్రధాన భాషల్లోనూ ఈ సినిమా విడుదలకానుంది. చిత్ర బృందం ఈ సినిమాలో నూతన నటీనటులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆడిషన్స్ ప్రకటించింది. వయసుతో సంబంధం లేకుండా ఎవ్వరైనా సరే ఆడిషన్స్ ఇవ్వొచ్చని, ఒక నిముషం పాటు యాక్టింగ్ వీడియాను ఇవ్వాలని తెలిపారు.

ఈ ఆడిషన్స్ ఈరోజు మంగళవారం హైదరాబాద్లోనే జరిగాయి. ప్రభాస్ సినిమా కావడం, అందునా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో అవకాశం దక్కించుకోవడానికి ఔత్సాహికులు భారీ సంఖ్యలో అల్యూమినియం ఫ్యాక్టరీకి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో జనం రావడంతో పోలీసులు పర్యవేక్షణను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అందరూ వన్ మినిట్ వీడియాతో ఆడిషన్స్ ఇవ్వడం జరిగింది. వీరి నుండి చిత్ర బృందం వారి అవసరానికి తగ్గట్టు నటీనటుల్ని ఎంపిక చేస్తారు. తర్వాతి ఆడిషన్స్ బెంగుళూరు, చెన్నైలలో జరగనున్నాయి. ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘రాధే శ్యామ్’ పూర్తవగానే ‘సలార్’ సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నారు ప్రభాస్.

Salaar 2

సంబంధిత సమాచారం

తాజా వార్తలు